సంక్రాంతికి స్లాట్ దొరికిందంటే చాలు ఏ నిర్మాత కూడా వెనుకడుగు వేయడు. వర్క్ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉన్నా రిలీజ్ డేట్ ముందు రోజు వరకు ఎడిటింగ్ రూమ్ లో కసరత్తులు చేస్తుంటారు. ఎందుకంటే సంక్రాంతిలో టాక్ ఎలా ఉన్నా ముందు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందనే నమ్మకం ఎక్కువ. ఏమాత్రం టాక్ బాగున్నా జాక్ పాట్ కొట్టేసినట్లే. ఇక 2025 సంక్రాంతిలో క్రేజీ లైనప్ అయితే సిద్ధంగా ఉంది.
కానీ ఈసారి ఊహించని విధంగా బంధం అనేది రెండు సినిమాలకు ఇబ్బందిగా మారింది. మొదట మెగాస్టార్ విశ్వంభర సంక్రాంతికి అనుకున్నారు. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం మెగాస్టార్ వెనుకడుగు వేయక తప్పలేదు. ఇక మరోవైపు తండేల్ పరిస్థితి కూడా అలానే ఉంది. నిజానికి డిసెంబర్ లో రావాల్సిన తండేల్ సంక్రాంతికి వస్తే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి బాగా ఒత్తిడి పెరిగింది.
ఇక మొదట నిర్మాత బన్నీ వాసు ధైర్యం చేయాలని అనుకున్నప్పటికి అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేక సతమతమవుతున్నారు. గీతా ఆర్ట్స్ - బన్నీ వాసు - అల్లు అరవింద్ తప్పనిసరిగా రామ్ చరణ్ కోసం ఆలోచించి తీరాలి. నిజానికి గేమ్ ఛేంజర్ కంటే బజ్ ఎక్కువగా తండేల్ పైనే ఉంది. కాబట్టి క్లాష్ అయితే కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఎక్కువ. ఇక మరోవైపు నాగచైతన్య కూడా వెంకీ మామ కోసం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ విషయంలో లేటెస్ట్ గా దర్శకుడు చందు మొండేటి కూడా క్లారిటీ ఇచ్చేశారు. అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ కోసం ఆలోచించినా, నాగచైతన్య వెంకీమామ కోసం ఆలోచించినా తండేల్ సంక్రాంతికి రావడం కష్టమని చెప్పేశారు. సినిమాకు సంబంధించిన అన్ని పనులు డిసెంబర్25 నాటికి ఫినిష్ అవుతాయట. సంక్రాంతికి అయితే సిద్ధమే. కానీ ఫ్యామిలీ కనెక్షన్ల గురించి ఆలోచిస్తే వెనుకడుగు వేయక తప్పదు. ఏదేమైనా ఈ క్లాష్ లో ఫ్యామిలీ బాండింగ్స్ కారణంగా మెగాస్టార్, నాగచైతన్య త్యాగం చేయక తప్పడం లేదని అర్ధమవుతుంది.
Follow
Follow
Post a Comment