తెలుగు రాష్ట్రాల్లో ఏ పండగ వచ్చినా, థియేటర్లు సందడితో నిండిపోతాయి. ఈ నెలలో దసరా, దీపావళి పండగలతో ప్రేక్షకులకు పండగ వాతావరణం నెలకొంది. దసరా సందర్భంగా విడుదలైన ‘వేట్టయన్,’ ‘విశ్వం,’ ‘మా నాన్న సూపర్ హీరో,’ ‘జనక’ చిత్రాలు బరిలోకి దిగినా, పసలేని కంటెంట్ కారణంగా ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయాయి.
ఇక దీపావళి పండగకే అందరి దృష్టి మళ్లింది. ఈసారి విడుదలకానున్న సినిమాలు బలమైన కంటెంట్‌తోనే వస్తున్నాయన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో నెలకొంది. ముందుగా దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ పై మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చాలా కొత్తగా ఉండడంతో పాటు, థ్రిల్లర్ అంశాలను ఆకర్షణీయంగా చూపించారు. ఈ సారి వెంకీ అట్లూరి కొత్త జానర్‌లో ప్రయత్నించడంతో మరింత ప్రత్యేకతగా కనిపిస్తోంది.
అలాగే కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల అంచనాలను పెంచాయి. వరుస ఫ్లాపుల తర్వాత కిరణ్ ఈ చిత్రంతో సక్సెస్ అందుకుంటాడని ఆశిస్తున్నారు. ఇంకా, అమరన్, భగీర వంటి అనువాద చిత్రాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. అమరన్ ముకుంద్ అనే దివంగత ఆర్మీ ఆఫీసర్ బయోపిక్ గా వస్తోంది. భగీర చిత్రంలో ప్రశాంత్ నీల్ కథను ఆకట్టుకునేలా చూపించారు. దీపావళి పండగకు ఈసారి కంటెంట్ ప్రధానంగా నిలిచే సినిమాలు వస్తుండడంతో ఏ చిత్రం విజయం సాధిస్తుందో చూడాలి.
Follow
Follow
Post a Comment