Megastar changing the Director again?
Tuesday, May 11, 2021
0
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనంతరం. రెండు రీమేక్ సినిమాలతో రాబోతున్న విషయం తెలిసిందే. మలయాళం హిట్ మూవీ లూసిఫర్, తమిళ్ మూవీ వేదళం వంటి సినిమాలను రీమేక్ చేయాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముందుగా మోహన్ రాజా దర్శకత్వంలోనే లూసిఫర్ ను స్టార్ట్ చేయాలని అనుకున్నారు.
అయితే కథలో మార్పులు చేయమని హోమ్ వర్క్ ఇవ్వగా మోహన్ రాజా అనుకున్నంత స్థాయిలో మెప్పించడం లేదని సమాచారం. ఇప్పటికే రెండుసార్లు కథను విన్న మెగాస్టార్ ఆ మార్పులు ఏ మాత్రం ఇంప్రెస్ గా లేవట. తమిళ్ లో తని ఒరువన్ వంటి సినిమాను తెరకెక్కించిన అనుభవం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో లూసిఫర్ స్క్రిప్ట్ కు న్యాయం చేయడం లేదట. దీంతో దర్శకుడిని మార్చే ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Tags