ప్రముఖ PRO, నిర్మాత బీఏ.రాజు మృతి


తెలుగు చిత్ర పరిశ్రమలో PRO గా కొనసాగుతూ ఎంతగానో గుర్తింపు అందుకున్న  ప్రముఖ నిర్మాత, పీఆర్వో బి.ఏ. రాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని శుక్రవారం రాత్రి తన నివాసంలోనే గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది.

సినిమా జర్నలిస్టుగా మొదలైన రాజు గారి ప్రయాణం అనంతరం సూపర్ స్టార్ కృష్ణ నుంచి మహేష్ బాబు వరకు అన్ని సినిమాలకు PRO బాధ్యతలు తీసుకుంటూ వచ్చారు. దాదాపు అందరి హీరోలతో దర్శకులతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఇక నిర్మాతగా ‘లవ్లీ’, ‘వైశాఖం’ వంటి చిత్రాలకు నిర్మించారు. రెండేళ్ల క్రితం ఆయన భార్య, దర్శకురాలు బి.ఏ. జయ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక బి.ఏ.రాజు మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.


Post a Comment

Previous Post Next Post