Subscribe Us

Trivikram with another Mega Hero?


టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల.. వైకుంఠపురములో సినిమాతో నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ హిట్ అందుకున్నప్పటికి స్టార్ హీరోలు అంత ఈజీగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా ఆలోచనలతో పక్కకు తప్పించిన విషయం తెలిసిందే.

ఇక మహేష్ బాబు సినిమా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినప్పటికీ ఇంకా మహేష్ ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రాజెక్ట్ ఓకే అయినా కూడా కొందరిలో అనుమానాలు పోలేదు.  ఆ సంగతి అటుంచితే రామ్ చరణ్ తో కూడా త్రివిక్రమ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. RRR అనంతరం చరణ్ - శంకర్ సినిమాతో బిజీ కానున్న చరణ్ అలాగే త్రివిక్రమ్ కథ ఓకే అయితే వెంటనే ఎనౌన్స్ చేయవచ్చని టాక్ వస్తోంది. కథ అయితే ఆల్ మోస్ట్ ఫినిష్ అయినట్లు సమాచారం. మరి చరణ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.


Post a Comment

0 Comments