ఫైనల్ గా ప్లాప్ దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్!!


టాలీవుడ్ యువ హీరో నితిన్ పెళ్లి అనంతరం కాస్త స్పీడ్ పెంచాడు. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా అంటేనే ఆశ్చర్యం అనుకున్న అభిమానులకు ఈసారి గ్యాప్ లేకుండా రెండు మూడు సినిమాలను వదులుతున్నాడు. లాక్ డౌన్ అనంతరం ఒక నెల గ్యాప్ లోనే రెండు సినిమాలు రిలీజ్ చేశాడు.

చెక్, రంగ్ దే భారీ హైప్ తోనే విడుదల అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టేశాడు. చెక్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గతకొంత కాలంగా వరుస అపజయాలు అందుకున్నప్పటికి నితిన్ అతని మీద నమ్మకంతో సినిమా చేశాడు కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు నా పేరు శివతో దర్శకుడిగా ప్లాప్ ఎదుర్కొన్న వక్కంతం వంశీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా ఈ కాంబోపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. రెగ్యులర్ గా స్క్రిప్ట్ పై చర్చలు జరుపుతున్నారట. ఇక ఇటీవల ఫైనల్ స్క్రిప్ట్ మొత్తం మరోసారి విన్న నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ ఏడాది చివరలోనే ఆ సినిమా సెట్స్ పైకి రావచ్చని సమాచారం.


Post a Comment

Previous Post Next Post