Here is #RRR Mind Blowing Intro Details!!
Saturday, May 08, 2021
0
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో RRR ఒకటి. 450కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాను రాజమౌళి నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రల్లో నటిస్తున్నారు.
తారక్ కొమురం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలతో అభిమానులకు పునకాలు తెప్పియ్యడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఇక సినిమాలో మొదట్లోనే వారిద్దరికి సంబంధించిన ఒక హై వోల్టేజ్ సీన్ అద్భుతంగా ఉంటుందట. ఎన్టీఆర్ ను అరెస్ట్ చేయడానికి పొలిసాఫీసర్ గా పెద్ద బెటాలియన్ తో రాంచరణ్ వేళతాడట. ఇక ఎన్టీఆర్ కోసం గ్రామ ప్రజాలు పోలీసుల ముందు అడ్డుగా ఉంటారట. సినిమాలో ఈ సీన్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటుందని సమాచారం. ఇక సినిమాలో ఉండే VFX వర్క్ కూడా హైలెట్ అని టాక్. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఆ సీన్స్ ను తెరకెక్కించినట్లు సమాచారం.
Follow @TBO_Updates
Tags