పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ జీవితంలో ఎప్పుడు లేనంతగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. సినిమా హిట్ సక్సెస్ అని సంబంధం లేకుండా మార్కెట్ ను పెంచుకున్న పవర్ స్టార్ వకీల్ సాబ్ తో మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించారు. ఇక సినిమా అనంతరం వెంటనే మరొక రెండు సినిమాలతో బిజీ అయిన విషయం తెలిసిందే.
ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం వకీల్ సాబ్ తరువాత హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ లైన్ లోకి అయ్యప్పనుమ్ కొశీయుమ్ తొందరగా సెట్టవ్వడంతో మళ్ళీ నెంబర్లు చేంజ్ అయ్యాయి. ఇక ప్రస్తుతం సెకండ్ వేవ్ వలన హరిహర వీరమల్లు కంటే ముందు మరో సినిమా వచ్చే ఛాన్స్ ఉందట. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ పక్కా ప్లాన్ తో తొందరగా సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. పవన్ కూడా కుదిరితే ఓ వైపు హరిహర వీరమల్లులో పాల్గొంటునే హరీష్ శంకర్ సినిమాను కూడా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యాడట. కోవిడ్ ఇలానే కొనసాగితే సంక్రాంతి కంటే ముందుగా హరీష్ శంకర్ సినిమా విడుదలకు సిద్ధం కావచ్చని సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment