చిరు, ప్రభాస్, పవన్.. అందరూ అదే టార్గెట్ చేస్తున్నారా?


టాలీవుడ్ ను మరోసారి కరోనా దెబ్బ కొట్టింది. అంతా హ్యాపీగా కొనసాగుతున్న టైమ్ లో సెకండ్ వేవ్ పెద్ద సినిమాల స్పీడుకు సడన్ బ్రేక్ వేసింది. రిలీజ్ విషయంలో కొందరు ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇంకా ఎన్ని వేవ్స్ ఉంటాయో తెలియదు గాని థియేటర్లు తెరిస్తే పరిస్థితులను బట్టి మొదట లవ్ స్టొరీ, సీటీమార్, టక్ జగదీష్, విరాటపర్వం వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతాయి.

అయితే చాలా వరకు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ ను వాయిదా వేసుకోక తప్పడం లేదు. ఇక మెగాస్టార్, పవర్ స్టార్, రెబల్ స్టార్ వంటి అగ్ర హీరోలు దసరాను టార్గెట్ చేసినట్లు సమాచారం. ఆచార్య, రాధేశ్యామ్, అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ సినిమాలు మూడు కూడా దసరా వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు రిలీజ్ చేయకపోతే ఆర్థిక భారం తప్పదు. అందుకే పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించినా కూడా ఎవరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదని టాక్. మరి ఈ విషయంలో అగ్ర హీరోలు ఎలా ఆలోచిస్తారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post