మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో మరో స్టార్ హీరోయిన్?


అతడు - ఖలేజా వంటి విభిన్నమైన సినిమాలతో మహేష్ ఒక డిఫరెంట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా తన స్థాయిని పెంచుకున్నాడు. ఇక మూడవసారి ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తప్పకుండా సినిమా హై లెవెల్లో ఉంటుందని అందరు భావిస్తున్నారు.

ఇక త్రివిక్రమ్ ఈసారి కూడా ఇద్దరు హీరోయిన్స్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ముందుగా కియారా అద్వానీ ఫిక్స్ అయినట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు నయనతారను ముఖ్యమైన పాత్ర కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు నయన్ వీరితో కలిసి వర్క్ చేసింది లేదు. సెట్టయితే మాత్రం ఆమె కెరీర్ కు మరింత బూస్ట్ వచ్చినట్లే. ఇక త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు మహేష్ బాబు సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post