థియేటర్స్ పార్కింగ్ చార్జీలపై ప్రభుత్వంతో సమావేశాలు..


2018 లో తెలంగాణ ప్రభుత్వం ఉచిత పార్కింగ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తిరిగి పార్కింగ్ చార్జీలకు అనుమతి ఇవ్వడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు వెసులుబాటు ఉంటుందని సినిమా ప్రొడ్యూసర్స్ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు.

సినిమా ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు , దిల్ రాజ్ ,దామోదర ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి సీఎస్ కు క్లియర్ గా వివరించారు.
థియేటర్ల లో పార్కింగ్ నుండే దాదాపు 40% రాబడి ఉంటుందని వివరణ ఇవ్వగా.. సీఎస్ సానుకూలంగా స్పందించారు. వెంటనే ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతామని నిర్మాతలకు భరోసా ఇచ్చారు. ఇక థియేటర్స్ ఇంకా ఓపెన్ కాకపోవడానికి కారణం ప్రస్తుతం కొన్ని కారణాల వల్లనే అంటూ.. ఆంధ్ర ప్రదేశ్ నిర్ణయంపై కూడా ఆలోచించాల్సి ఉందని తెలిపారు. ఏపీలో 50% ఆక్యుపెన్సీ పై కూడా పెదవి విరుస్తున్న సినీ నిర్మాతలు మరోసారి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందట.

Post a Comment

Previous Post Next Post