అఖిల్ ఏజెంట్.. మమ్ముట్టి కోసం సాలీడ్ రెమ్యునరేషన్!


టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ 5వ సినిమాతో ఏదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. మొదటి మూడు సినిమాలు అంతగా ఆడకపోవడంతో తదుపరి సినిమాలతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక నాలుగవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాస్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవచ్చు కానీ 5వ సినిమా ఏజెంట్ మాత్రం పర్ఫెక్ట్ మాస్ ఆడియెన్స్ సినిమా అని తెలుస్తోంది.

సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఆ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. అఖిల్ ఒక RAW ఏజెంట్ గా కనిపిస్తాడని సమాచారం. సినిమాలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఆయనకు 3కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. చివరగా మమ్ముట్టి తెలుగులో యాత్ర సినిమాలో నటించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ఆ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.


Post a Comment

Previous Post Next Post