మహేష్ - రాజమౌళి మూవీ గుట్టు విప్పిన రైటర్!


రైటర్ విజయేంద్రప్రసాద్ ఇటీవల వరుసగా ఇంటర్వ్యలు ఇచ్చేస్తున్నారు. అంతే కాకుండా రాజమౌళి సీక్రెట్ గా ఉంచాలని అనుకునే విషయాలను ఆయన చాలా ఈజీగా బయటపెట్టేస్తున్నారు. మొన్న RRR కు సంబంధించిన కీలకమైన అంశాలను రివీల్ చేసి ఒక విధంగా మంచి బజ్ అయితే క్రియేట్ చేశారు.

ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాపై కూడా ఒక గుట్టు విప్పారు. సినిమా స్క్రిప్ట్ పనులు ఇంకా పూర్తవ్వలేదని కథ మొత్తం ఆఫ్రికన్ జంగిల్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని అన్నారు. రాజమౌళి స్క్రిప్ట్ పై కొన్ని కొత్త ఐడియాలను ఆచరణలో పెట్టాల్సి ఉందని సినిమాను ఒక యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కించనున్నట్లు చెప్పారు. అంతే కాకుండా లొకేషన్స్ పై కూడా అన్వేషణను కొనసాగించనున్నట్లు తెలియజేశారు.


Post a Comment

Previous Post Next Post