మెగాస్టార్ తో పవన్ డైరెక్టర్? - TollywoodBoxoffice.in

Exclusive Portal for Tollywood Boxoffice

మెగాస్టార్ తో పవన్ డైరెక్టర్?


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలను సెట్స్ పైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గాడ్ ఫాదర్(లూసిఫర్) మలయాళం రీమేక్ సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే మరొక మలయాళం సినిమాను కూడా రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నాడు పృద్వి రాజ్ మోహన్ లాల్ నటించిన బ్రో డాడీ సినిమా మా హక్కుల ను ఇటీవల ఆయన సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆ సినిమాను పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం భవదియుడు భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్న హరీష్ ఆ సినిమా అనంతరం మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన చర్చలు కూడా ఇటీవల మొదలైనట్లు సమాచారం. ఇక పవన్ సినిమాను త్వరలోనే స్టార్ట్ చేయాలని హరీష్ షెడ్యూల్స్ సెట్ చేసుకుంటున్నాడు. ఇక బ్రో డాడీ సినిమాను ఈ ఏడాది చివరలో స్టార్ట్ చేయవచ్చని సమాచారం.