మహేష్ తరువాత రాజమౌళి ప్రాజెక్ట్ అతనితోనే!


సూపర్ స్టార్ మహేష్ బాబుతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేయబోతున్న దర్శక ధీరుడు రాజమౌళి ఆ తరువాత ఇంకా ఎవరితో వర్క్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళితో వర్క్ చేయడానికి బాలీవుడ్ కోలీవుడ్ అగ్ర హీరోలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే రాజమౌళి మాత్రం టాలీవుడ్ హీరోలతోనే తదుపరి సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందని గతంలోనే చాలా కథనాలు రాగా ఇప్పుడు అదే నిజమయ్యేట్లు ఉంది. అసలైతే వీరి కలయికలో మగధీర సినిమా తరువాతే ఒక సినిమా రావాల్సింది. కానీ ఎందుకో అప్పుడు సెట్టవ్వలేదు. ఇక ఇప్పుడు మాత్రం మహేష్ సినిమా అనంతరం రాజమౌళి, అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ లాక్ చేసుకునేలా ఉన్నట్లు అర్ధమవుతోంది. నిర్మాత అల్లు అరవింద్ కూడా ప్రొడక్షన్ లో భాగం కానున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ కూడా రాజమౌళితో సంప్రదింపులు జరపనున్నట్లు టాక్ వస్తోంది.

Post a Comment

Previous Post Next Post