రాధే శ్యామ్ దెబ్బ.. RRRపైనే దిల్ రాజు ఆశలు!


టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మొదట డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే నిర్మాతగా ఆయన ఎన్ని సినిమాలు చేసినా డిస్ట్రిబ్యూటర్గా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పెద్ద సినిమాలను నైజాం ఏరియాలో భారీ స్థాయిలో విడుదల చేయడంలో ముందుంటున్నారు. అయితే ఇటీవల విడుదల చేసిన రాధే శ్యామ్ సినిమాతో దిల్ రాజు భారీ స్థాయిలో నష్టపోవాల్సి వచ్చింది. దాదాపు 20 కోట్ల వరకు ఆ సినిమా నష్టాలను మిగిల్చినట్లు సమాచారం.

ఇక ఇప్పుడు దిల్ రాజు RRR సినిమా తో ఆ నష్టాలను రికవరీ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. నైజాం ఏరియాలో రూ 70 కోట్ల పెట్టుబడి తో సినిమాను విడుదల చేస్తున్న దిల్ రాజు ఎలాగైనా మంచి లాభాలను అందుకోవాలి అని అనుకుంటున్నాడు. మొదటి రోజే ఈ సినిమా నైజాం ఏరియాలో 20 కోట్ల వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తారా స్థాయికి చేరిపోయాయి. మరి ఫైనల్ గా దిల్ రాజు రాధే శ్యామ్ నష్టాలను RRR సినిమాతో రికవరీ చేస్తాడో లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post