RRR: మొసలితో ఫైట్?


టాలీవుడ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR పై అంచనాలు రోజురోజుకు అమాంతంగా పెరిగిపోతున్నాయి. నిజమైన ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రల ఆధారంగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అంచనాలకు మించి ఉంటాయి అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా కలిసి చేసే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా మరొక లెవెల్లో ఉంటాయట.

ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్లో బ్రిడ్జి ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటుందట. ఆ ప్రయత్నంలో జాతీయ జండతో వీరిద్దరూ కలిసి కనిపించడం ఎంతో భావోద్వేగానికి గురి చేస్తుంది. అయితే నీటిలో పడినప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా మొసలి ప్రమాదాన్ని చాలా చాకచక్యంగా ఎదిరిస్తారు అని తెలుస్తోంది. ఇద్దరు మొసలి తో పోరాడే సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. చత్రపతి సినిమాలో రాజమౌళి ప్రభాస్ తో ఒక భారీ చేపతో ఎలాగైతే అద్భుతమైన సీన్ క్రియేట్ చేశాడో ఇప్పుడు మొసలి తో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ని అంతకు మించి అనేలా బలంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post