RRR స్పెషల్ షోలు.. కూకట్ పల్లి థియేటర్ లిస్ట్!


బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ షో లు ఏమైనా ఉంటాయా అని అభిమానులు గత కొన్ని రోజులుగా దిల్ రాజు కు సంబంధించిన సన్నిహితులను సంప్రదిస్తున్నారు. నైజాంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలిమ్స్ త్రిబుల్ ఆర్ సినిమా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇన్నామురి గోపీచంద్ అనే మరొక డిస్ట్రిబ్యూటర్ స్పెషల్ షోలకు సంబంధించిన రిలీజ్ హక్కులను దక్కించుకున్నట్లు. మార్చి 25వ తేదీన తెల్లవారుజామున ఈ థియేటర్స్ లో స్పెషల్ షోలతో సందడి మొదలుకానుంది. కూకట్ పల్లి - భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్, అర్జున్ థియేటర్స్ లో స్పెషల్ షోలను ప్రదర్శించబోతున్నారు. ఇక మూసాపేట్  రాములు థియేటర్, బోరబండలోని విజేత థియేటర్ లో కూడా శుక్రవారం తెల్లవారుజామున ప్రత్యేకమైన 
షోలతో RRR హవా మొదలు కానుంది.

Post a Comment

Previous Post Next Post