ఆచార్య.. ఇక రెమ్యునరేషన్ ఏమడుగుతారు?


ఆచార్య సినిమా ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయడం, ఆ తరువాత రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పడం, మణిశర్మ మ్యూజిక్స్ పూజా, కాజల్ హీరోయిన్స్.. ధర్మస్థలి సెట్.. ఇలా అన్ని అంశాలు చూసుకుంటే సినిమా మినిమమ్ ఉంటుందని అనుకున్నారు. ఇక ఈ సినిమా కోసం ఖర్చు విషయంలో నమ్మకంతో నిర్మాత వెనక్కి తగ్గలేదు. 

అంతే కాకుండా కొరటాల శివ 20 కోట్ల రెమ్యునరేషన్ వద్దని విడుదల తరువాత చూసుకుందాం అని అనుకున్నారు. కానీ అనుకున్నది ఒక్కటి. అయినదోక్కటి.. అన్నట్లు ఆచార్య తేడా కొట్టేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 80కోట్లు నష్టాలను అందించవచ్చని సమాచారం. దీంతో ఇప్పుడు దర్శకుడు రెమ్యునరేషన్ విషయంలో నోరు మెదపని పరిస్థితి ఎదురైంది.


Post a Comment

Previous Post Next Post