హరిహర వీరమల్లు.. ఇది తగునా?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి హిస్టారికల్ నేపథ్యంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు అని తెలియగానే అభిమానులు ఎంతగానో సంతోషించారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొదలైనప్పుడు ఏ స్థాయిలో న్యూస్ వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ బజ్ మొత్తం కూడా మొదట్లోనే కనిపించింది. 

షూటింగ్ కొనసాగుతున్న కొద్దీ అసలు ఏమాత్రం ఆసక్తిగా అనిపించడం లేదు. ఇప్పటివరకు దర్శకుడు క్రిష్ అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్ లతోనే అరాకొరగా సగం సగం సీన్స్ ని మాత్రమే పూర్తి చేశాడు. అసలైతే ఈ సినిమాను గత ఏడాదిలో పూర్తి చేసి ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. మరోవైపు కరోనా దెబ్బ కొట్టడం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం దానికి తోడు భీమ్లా నాయక్ మధ్యలో రావడం ఇలా అన్ని కారణాలు వీరమల్లు షూటింగ్ కు అడ్డం పడ్డాయి. ఇక ఇప్పుడు దసరా కి రాలేని పరిస్థితి. వచ్చే ఏడాది సంక్రాంతి సమ్మర్ కు అగ్ర హీరోలు లాక్ చేసుకున్నారు. మరి హరిహర వీరమల్లు ఎప్పుడు వస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post