జబర్దస్త్ రేటింగ్ అంత దారుణంగా పడిపోయిందా?


2013లో మొదలైన కామెడీ షో జబర్దస్త్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా కూడా రేటింగ్స్ అయితే ఏమాత్రం తగ్గలేదు. అయితే ప్రస్తుతం మాత్రం కొంతమంది సీనియర్ కమెడియన్లు జడ్జిలు కూడా వెళ్ళిపోతూ ఉండడంతో ఈ షోపై ఎన్నో అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా యాజమాన్యం తీరు కూడా సరిగ్గా లేదు  అని కొందరు కమెడియన్స్ కూడా వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. 

ఇక గతంలో అయితే దాదాపు 18 పైగా రేటింగ్ అందుకొని ఇండియాలో నెంబర్ వన్ కామెడీ షో గా కూడా జబర్దస్త్ క్రేజ్ అందుకుంది. అయితే మెల్లగా సీనియర్ కమెడియన్స్ కూడా వెళ్లిపోతూ ఉండడం అలాగే ఇతర ప్రభావం కూడా పడుతూ ఉండడంతో జబర్దస్త్ కు ఆదరణ తగ్గింది. అలాగే బూతు కంటెంట్ ఎక్కువైంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక రీసెంట్ గా జబర్దస్త్ సీనియర్ కమెడియన్ అప్పారావు అయితే చాలావరకు రేటింగ్ తగ్గిపోతుంది అని అప్పట్లో 18 రేటింగ్ తో కొనసాగిన జబర్దస్త్ ఆ తర్వాత 4 నుంచి 6 రేటింగ్స్ తో కొనసాగినట్లుగా చెబుతున్నారు.

Post a Comment

Previous Post Next Post