త్రివిక్రమ్ పై అలకా? లేదా తీరిక లేదా మహేష్?


సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. మొత్తానికి త్రివిక్రమ్ తో ఎన్నోసార్లు కథలో మార్పులు చేయమని చెప్పిన సూపర్ స్టార్ చివరికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు కానీ ఇంకా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు అనే అనిపిస్తోంది. ఎందుకంటే చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేసే మహేష్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే కనీసం రీట్వీట్ కూడా చేయలేదు.

ఈ సినిమా లాంచ్ సమయంలో కూడా మహేష్ సోషల్ మీడియాలో పెద్దగా స్పందించలేదు. ఇక ఇప్పుడు ఆగస్టులో షూటింగ్ మొదలు, సమ్మర్లో సినిమా రిలీజ్ అని అభిమానులు అందరూ కూడా హడావిడి చేస్తున్న సమయంలో మహేష్ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. చిన్న చిన్న విషయాలపై కూడా ట్వీట్ చేస్తూ హైప్ క్రియేట్ చేసే మహేష్ గతంలో సినిమా అఫీషియల్ గా ప్రకటించినప్పుడు కూడా ఒక ట్వీట్ కూడా చేయలేదు. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ రిలీజ్ డేట్ పై కూడా ట్విట్టర్ లో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మరి ఈ తరహాలో ఉండడం చూస్తుంటే మహేష్ బాబు త్రివిక్రమ్ పై అలిగాడా? లేక తీరిక లేదా? అనేది కాస్త కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తోంది.

Post a Comment

Previous Post Next Post