యువ హీరో నితిన్ పై దర్శకుడు కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రణం, ఖతర్నాక్ టక్కరి సినిమాలతో దర్శకుడుగా గుర్తింపునందుకున్న అమ్మా రాజశేఖర్ అంతకంటే ముందు ఇండస్ట్రీలో ఒక కొరియోగ్రాఫర్ గా క్రేజ్ అందుకున్నారు. కొన్నాళ్లకు ఆయన వరుస అపజయాలతో అవకాశాలు అందుకోలేకపోయారు.
ఇక ప్రస్తుతం దర్శకుడుగా కొన్ని చిన్న సినిమాలను చేస్తూనే కథానాయకుడుగా కూడా నటిస్తున్నారు. అయితే ఇటీవల హైఫై అనే తన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నితిన్ పిలిచినా కూడా రాలేదు అని తీవ్రస్థాయిలో బాధపడుతూ నెగిటివ్ కామెంట్ చేశారు. నితిన్ కు ఒకప్పుడు డాన్సే రాదు. అతనికి నేను డాన్స్ నేర్పించాను. అయితే నా సినిమా ఈవెంట్ కు పిలవగానే వస్తానని చెప్పిన నితిన్ మళ్లీ ఆ తర్వాత రాకుండా నన్ను ఇన్సల్ట్ చేశాడు. ఇంటి దగ్గరే ఉన్నాడు. అయినా కూడా రాలేదు.. అంటూ అమ్మ రాజశేఖర్ చాలా ఎమోషనల్ అవుతూ తెలియజేశాడు. మరి ఈ విషయంపై నితిన్ ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.
Follow
Post a Comment