మెగాస్టార్ కంటే నాగ్ బెటర్ కదా..?


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే తర్వాత మెగాస్టార్ నుంచి రాబోయే సినిమాలేవి కూడా అంతగా ఆసక్తికరంగా అనిపించడం లేదు. అవన్నీ కూడా రీమేక్ సినిమాలు కావడంతో ఓ వర్గం మెగా ఫ్యాన్స్ నుంచి కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గాడ్ ఫాదర్ సినిమా మలయాళంలో సక్సెస్ అయినా లూసీపర్ సినిమాకు రీమేక్ గా రానుంది. 

అయితే ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేయగా పెద్దగా హైప్ అయితే ఏమి క్రియేట్ చేయలేకపోయింది. ఆ సినిమా లుక్ ను రెండు చానల్స్ లో విడుదల చేశారు. ఇక మెయిన్ చానల్ లో అయితే 2.5 మిలియన్ వ్యూవ్స్ అందుకుంది. అది కూడా ఆరు రోజులు పట్టింది. మరొకవైపు నాగార్జున గోస్ట్ సినిమా మాత్రం ఒక రోజులోనే 2.3 మిలియన్ వ్యూవ్స్ అందుకుంది. ఈ లెక్కన చూస్తే మేయిన్ ఛానెల్ లో నాగ్ సినిమా కంటే మెగాస్టార్ ఫస్ట్ లుక్ అంతగా హైప్ క్రియేట్ చేయలేదు. నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఫ్యాన్స్ ను అంతగా కనెక్ట్ కాలేదని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post