విరూపాక్ష డైరెక్టర్.. మెగా ఛాన్స్?


విరుపాక్ష సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు కార్తీక్ దండు నెక్స్ట్ స్టార్ హీరోతో మరో బిగ్ ప్రాజెక్ట్ సినిమా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. తరువాత చేయబోయే సినిమా కూడా అతను డిఫరెంట్ హారర్ బ్యాక్ డ్రాప్ లోనే చేయాలని ఆలోచిస్తున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఇతనిపై ఓ వర్గం ఆడియెన్స్ ఫోకస్ ఎక్కువవుతోంది.

కార్తీక్ తనకు హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టమని కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో కొన్ని కథలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక కథ గురించి బాగా చర్చించి అందులో కొన్ని మార్పులు చేయగలిగితే మన కాంబినేషన్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని సలహాలు కూడా ఇచ్చారట. 

అయితే బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు గురించి మాట్లాడదామని కూడా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడికి ఒక వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక విరూపాక్ష సినిమాతో కార్తీక్ భారీ సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు అతని తదుపరి సినిమా తప్పకుండా భారీ బడ్జెట్లోనే ఉంటుంది అని చెప్పవచ్చు. మరి అతను మెగాస్టార్ కు కథ చెప్పి ఒప్పిస్తాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post