దుల్కర్ రెమ్యునరేషన్.. డోస్ పెంచాడు!


మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ మొదట్లో అనుకున్నంత స్థాయిలో గుర్తింపు అందుకోలేదు. కానీ ఇటీవల కాలంలో అతను ఎంచుకుంటున్న కథలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ముఖ్యంగా సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో కూడా అతనికి మంచి గుర్తింపు ఏర్పడింది. అంతకుముందే మహానటి సినిమాతో కూడా అతను నటుడిగా తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. 

అయితే ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే సీతారామం సినిమాకు అతను అత్యధికంగా మూడు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నాడు. కానీ ఈసారి అంతకుమించి అనేలా ఏడు కోట్లకు పైగానే ఛార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీతారామం సినిమా తెలుగులో మంచి సక్సెస్ కావడంతో ఇప్పుడు అతనే మార్కెట్ వాల్యూ పెరిగింది. కాబట్టి సీతార ప్రొడక్షన్ లో చేస్తున్న సినిమా నుంచి అతను ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది.

Post a Comment

Previous Post Next Post