దగ్గుబాటి అభిరామ్ లాంచ్.. టైటిల్ ఫిక్స్!


దగ్గుబాటి సురేష్ బాబు పెద్ద కుమారుడు రానా ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ లలో ఒకరిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక రెండవ కుమారుడు అభిరామ్ కూడా హీరోగా మంచి గుర్తింపు అందుకోవాలని అడుగులు వేయబోతున్నారు. అసలైతే రెండేళ్ల క్రితమే అభిరామ్ లాంచ్ కు ప్రణాళికలు రచించారు.

కానీ అనుకోని కారణాల వలన ఎదో ఒక విధంగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఇక ఫైనల్ గా సినిమాకి సంబంధించిన టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అభిరామ్ కొత్త సినిమాకు 'అహింసా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. సినిమాలో అభిరామ్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ఆర్.పి. పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.


Post a Comment

Previous Post Next Post