అప్పుడే రూ.కోటికి వచ్చిన తేజ సజ్జ!


ఇంద్ర సినిమాలో చిన్నప్పటి హీరో పాత్రలో నటించిన తేజ సజ్జ ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జాంబీ రెడ్డి కమర్షియల్ గా మంచి హిట్టవ్వడంతో వరుసగా కొన్ని భిన్నమైన సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అంతే కాకుండా రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది.

మరోసారి జాంబీ రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మతోనే హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఆ సినిమా కోసం తేజ రూ.1కోటి వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్ వస్తోంది. హీరోగా రెండు సినిమాలు కూడా విడుదల కాలేదు అప్పుడే ఈ రేంజ్ లో అందుకుంటున్నాడు అంటే తేజ సజ్జ మామూలోడు కాదు. మరో హిట్టు కొడితే రెమ్యునరేషన్ డోస్ మరింత పెంచవచ్చు. ఇక ఇష్క్ అనే మరో సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post