గని శాటిలైట్ & డిజిటల్.. మైండ్ బ్లోయింగ్ డీల్!

 

మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాకు సాలీడ్ ఆఫర్ అందినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అల్లు అరవింద్ తన మాస్టర్ ప్లాన్ తో డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గని సినిమాని అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ నిర్మిస్తున్నారు.


అయితే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను కలిపి ఆహా రూ.23కోట్లకు అందుకున్నట్లు సమాచారం. డీల్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులను వేరే చానల్స్ కు మరో రేటుకు అమ్మి లాభం పొందాలని అల్లు అరవింద్ అలా డీల్ సెట్ చేశారు. ఇక సినిమాలో అర్జున్, సునీల్ శెట్టి, జగపతిబాబు వంటి టాప్ స్టార్స్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post