దేవర 2.. ఈ సీక్వెల్స్ వెనకున్న అసలు కారణం ఏమిటంటే..?


ఒక హారర్ సినిమా చూసినప్పుడు అందులో దెయ్యం క్యారెక్టర్ అక్కడితో ఎండ్ అయింది అని చూపిస్తూనే మళ్ళీ ఎవరినో ఒకరిని ఆవహించింది అనేలా ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయడం చాలా కామన్ గా కనిపించేది. అయితే ఇప్పుడు సీక్వెల్ అనే ట్యాగ్ కూడా ప్రతి సినిమాలకు అదే పాటర్న్ లో తగిలిస్తున్నారు. సీక్వెల్ లేదా రెండు భాగాలు అనేది ఇప్పుడు సినిమా ప్రపంచంలో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా అన్ని ఇవే పాట పాడుతున్నాయి. 

రీసెంట్ గా వచ్చిన స్కంద పెదకాపు రెండు సినిమాలు కూడా మరో భాగంగా రాబోతున్నాయి అని క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ సలార్, కల్కి , పుష్ప.2..ఇక ఇప్పుడు దేవర 2. కొరటాల శివ ఊహించిన విధంగా దేవర కూడా రెండు భాగాలుగా రాబోతుంది అని తెలియజేశారు. అయితే ఈ తరహాలో రెండో భాగాన్ని కూడా తీసుకురావడానికి కారణం స్టోరీ స్పాన్ ఎక్కువగా ఉండడం అనే కారణాలు రెగ్యులర్గా వినిపిస్తాయి. 

ఎక్కువగా అయితే మంచి కంటెంట్ మరింత ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఇలా చేస్తున్నామని ప్రతి సినిమా దర్శకుడు చెబుతారు. కానీ అసలు కారణాలు మాత్రమే మరొక విధంగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా బడ్జెట్ తో అనుకున్న నిడివి ఏమాత్రం ఎక్కువగా వచ్చినా ఇప్పుడు రెండు భాగాలుగా కట్ చేస్తున్నారు. 

పుష్ప నిడివి ఏకంగా ఆరు గంటలు రావడంతోనే సుకుమార్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కానీ పుష్ప 1 బాగా సక్సెస్ కావడంతో మళ్ళీ సగానికి సగం సీన్స్ రీ షూట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక అదొక కారణమైతే సినిమా లో ఫ్లో ఏమాత్రం మిస్ అయినా కూడా సేఫ్ జోన్ లో సెకండ్ పార్ట్ అనే ట్యాగ్ తగిలిస్తే సరిపోతుంది అని సెంటిమెంట్ కూడా ఇప్పుడు నడుస్తోంది. 

ఎందుకంటే సెకండ్ పార్ట్ అనగానే ఇంకా ఈ కథ ఇప్పుడు ఫినిష్ కాలేదు అనే.. సెకండ్ పార్ట్ అంతకుమించి ఉంటుంది అని ఆలోచనతో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటికి వస్తారు. బాహుబలి ఫస్ట్ పార్ట్ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా సీక్వెల్ అనే ట్యాగ్ హైప్ పెంచింది. కాబట్టి నెగిటివ్ గా ఉన్నా కూడా అంతగా ప్రభావం చూపకపోవచ్చునే ఆలోచిస్తూ ఉంటారు. 

కానీ రాజమౌళి పనితనంపై అదొక ట్రిక్ అని పేరు పెట్టలేము. కానీ కొందరు మాత్రం ఫ్లాప్ నుంచి తప్పించుకునేందుకో లేదంటే బిజినెస్ కోసం ఈ ట్రిక్ వాడుతున్నారు. సినిమా మార్కెట్ను ఉపయోగించుకోవాలి అని పెట్టిన పెట్టుబడి మళ్లీ సేఫ్ గా వెనక్కి రావడమే కాకుండా అంతకుమించి డబ్బులు రావాలి అని ఆలోచనతో కూడా ఈ విధంగా రెండు భాగాలు అనే ఫార్ములాను వాడుతున్నారు. ఏదేమైనా కూడా 2 పార్ట్స్ అనేది సినిమాకు ప్లస్ అయ్యే అంశమే కానీ దానికి తగ్గట్టుగా కంటెంట్ ఇస్తే సరిపోతుంది. మరి దేవర లో కొరటాల శివ ఎలాంటి కంటెంట్ ఇస్తాడో చూడాలి.

1 Comments

  1. Nuvvu velli tiyyara movie puka Anni judge chestunavu kojja munda

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post